VZM: సీతం ఇంజినీరింగ్ కాలేజీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టూడెంట్ కౌన్సిలర్ ఆర్. రాజు కుమార్ క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థులకు అద్భుతంగా అందించారు. కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ డా. బొత్సా ఝాన్సీ యేసుక్రీస్తు బోధనలు నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశి భూషణరావు, తదితరులు పాల్గొన్నారు.