MLG: మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌లో వేయగా..ఈ అంశం వివాదాస్పదం అయింది. ఈ విషయమై మంత్రి సీతక్క స్పందించారు. ‘స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం. రివర్స్ స్వస్తిక్ శతాబ్దాలుగా మాకు ఆచారంగా వచ్చింది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి’ అని కోరారు.