E.G: రాజానగరం నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ. 5.72 కోట్లు మంజూరు చేస్తూ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం తెలిపారు. కొత్తగా 12 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.