శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో బాహుబలి రాకెట్ LMV3-M6 ప్రయోగాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి అని, భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని కొనియాడారు.