బంగ్లాదేశ్లో ఉస్మాన్ హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఒమర్ హాదీ ఆరోపించారు. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఎన్నికలను అస్థిరపర్చేందుకే దీనికి పాల్పడ్డారని అన్నారు. గతేడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థుల ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన హాదీపై ఈనెల 12న ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.