TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది వ్యాపార వేత్త రాజ్ పాకాల తన ఫామ్‌హౌస్‌లో కొంతమందితో కలిసి పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో మోకిలా పోలీసులు తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో 35 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్లు తెలిపారు.