ASF: దక్షిణ మధ్య రైల్వే జనవరి 1 నుంచి కొత్త టైం టేబుల్ ప్రవేశ పెట్టనున్నట్లు కాగజ్ నగర్ రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమయాలు తెలుసుకుని ప్రయాణం చేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయాల్లో సందేహాలుంటే సమీప స్టేషన్ మేనేజర్ లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోని NTESను సంప్రదించాలని వారు సూచించారు.