నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దుకాణా సముదాయాల నిర్వహణ హక్కులకు బహిరంగ, సీల్డ్ టెండర్ వేలం ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆంజనీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల పరిమితితో కూడిన దుకాణా సముదాయాల ద్వారా రూ. 2,02,84,803 ఆదాయం సమకూరినట్లు వారు పేర్కొన్నారు.