MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో మంగళవారం రైల్వే సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మనోహరాబాద్ నుంచి అక్కన్నపేట వరకు రైల్వే ట్రాక్ పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్లో పలు విభాగాలను వారు పరిశీలించారు.