గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అక్కడి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు AP భవన్, ఇండియా గేట్, పార్లమెంట్, ప్రధాని కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.