VZM: చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు బుధవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే, అది చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నరన్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి వారు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.