AP: శ్రీహరికోట నుంచి ఇస్రో బాహుబలి రాకెట్ LMV3-M6 ప్రయోగాన్ని నింగిలోకి పంపింది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారతగడ్డ పైనుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహంగా రికార్డు సృష్టించిందన్నారు. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.