AKP: వినియోగదారుల చట్టాలపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కేవీఎల్ఎన్ మూర్తి అనకాపల్లి పూడిమడక రోడ్డు శారదా కాలనీలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. వినియోగదారుల రక్షణ చట్టంలో ముఖ్య అంశాలను వివరించారు. అన్ని విషయాలపైన విద్యార్థి దశలోనే అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు.