‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్లో తొంభై నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించి థియేటర్లలో విడుదల చేశారు.