BPT: పర్చూరు మండలం ఉప్పుటూరులో పూర్వం లవణపూరి ఉన్న శ్రీ చెన్నకేశ్వర, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన విశిష్టత కలిగినదిగా నిలిచింది. 11వ శతాబ్దంలో చోళులు చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించినట్లు ఆలయ అర్చకులు బృందావనం తాండవ కృష్ణమాచార్యులు తెలిపారు. ఇక్కడ ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు ప్రత్యేక దైవ దర్శనాలు ఏర్పాటు చేస్తామన్నారు.