ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి దాదాపు 30వేల పేజీలు ఉన్న ఫైళ్లను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ పేరు ప్రముఖంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ఉండటంతో ఆ దేశ న్యాయశాఖ వాటిని తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణలు అవాస్తవమైనవి స్పష్టం చేస్తూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టింది.