అనకాపల్లి పట్టణం దేమునిగుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. ఆలయ మండపంలో నిర్వహించిన లెక్కింపులో 41 రోజులకు రూ.3.88 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో మురళీకృష్ణ తెలిపారు. గ్రేడ్-1 అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బీ. శ్రీనివాసరావు పాల్గొన్నారు.