KRNL: జోన్-4 పరిధిలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 8 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, VRలో ఉన్న ఇద్దరికి పోస్టింగులు దక్కగా, స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒకరిని VR బదిలీ చేశారు.