AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన రద్దయింది. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు జనసేన నేతలు తెలిపారు. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు మళ్లీ వస్తానని పవన్ మాటిచ్చారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన గ్రామస్తులు, పర్యటన రద్దవడంతో నిరాశ చెందినట్లు తెలుస్తోంది.