AP: ఎన్నారై భక్తులు తిరుమలలోని కాంప్లెక్స్-1 వద్ద ఉన్న సుపథం మార్గం ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. అవసరమైన డాక్యుమెంట్లను చూపించి ఒక్కొక్కరు రూ.300 చెల్లించి టికెట్ పొందవచ్చు. సాధారణంగా ఈ ప్రత్యేక దర్శనం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు.