SKLM: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ధాన్యం తూకం, తరుగు, ఇతర సమస్యలపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం డివిజన్: 94942 33490, టెక్కలి డివిజన్: 97040 33093, పలాస డివిజన్: 73861 89275 నంబర్లకు రైతులు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.