తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3 వేల మంది పోలీసు బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతిలో అన్ని కెమెరాలను కంమాండ్ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేసి నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. ఈ నెల 30, 31, జనవరి 1న టోకెన్స్ ఉన్న వారికే స్వామి వారి దర్శనానికి అనుమతి ఉందని, వారికి అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.