NZB: జిల్లాలోని మీసేవ కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ‘మీసేవ’ అసోసియేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్ కిరణ్ కు మార్కు వినతిపత్రం అందజేశారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సర్వర్ సమస్యలను అధిగమించాలని, ఆధార్ కేంద్రాలకు ప్రభుత్వ లొకేషన్లు కల్పించాలని కోరినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సితారీ ప్రవీణ్ రాజ్ తెలిపారు.