గుంటూరు: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ రాకతో ఇండ్ల నాగేశ్వరమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ వస్తున్నాడన్న సమాచారంతో బుధవారం ఇప్పటం గ్రామంలోని తన ఇంటిని పార్టీ జెండాలు, పుష్పాలతో అలంకరించారు. పవన్ తన జీతం నుంచి నెలకు రూ.5వేలు పెన్షన్‌గా ఇస్తానని హామీ ఇవ్వడంతో నాగేశ్వరమ్మ భావోద్వేగానికి గురయ్యారు.