PDPL: మాదక ద్రవ్యాల, వినియోగం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, పెద్దపల్లి అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలు, హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని చెప్పారు.