NGKL: వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ టి. కల్పన జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నల్గొండలో నిర్వహించిన మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో ఆమెకు ‘కిసాన్ సేవ రత్న’ అవార్డును ప్రదానం చేశారు. పశువైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.