కృష్ణా: విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ’ ఉత్సవం జనవరి 8–10 వరకు నిర్వహించనున్నారు. లైవ్ బ్యాండ్స్, స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ సినిమా, ప్రముఖుల పుస్తకావిష్కరణలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని APTA డిప్యూటీ CEO శ్రీనివాస్ తెలిపారు. తొలి రోజు సీఎం చంద్రబాబు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. చివరి రోజు ప్రముఖ గాయకుడు జావేద్ అలీ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.