NLG: ప్రకృతి సేద్యంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జోగునూరి సుందర్, కరుణ దంపతులు రాష్ట్రస్థాయి “పుడమి పుత్ర” పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు నకిరేకల్‌లో మంగళవారం జరిగిన జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేతుల మీదుగా వీరు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అనుకున్నారు.