VSP: లంకెలపాలెం వినాయక నగర్ లేఔట్లో దారుణ హత్య జరిగింది. లంకెలపాలెంకు చెందిన ఈగల వెంకినాయుడు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.