కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లి సర్వీస్ రోడ్డులో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది. మహాలక్ష్మి హోటల్ సమీపంలో డ్రైనేజీ కాలువలు చెత్తతో నిండిపోవడంతో, మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తూ అపరిశుభ్రతను కలిగిస్తోంది. ఈ సమస్యపై గతంలోనే గన్నవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా, స్థానిక పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.