AKP: రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ వర్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేసి అనకాపల్లి తరలించారు. దీనిపై సీపీఎం నేతలు మాట్లాడుతూ.. అప్పలరాజును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.