ఢిల్లీలో కాలుష్యంపై కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 3 రోజులుంటే గొంతు నొప్పి (అలర్జీ) వచ్చిందని తెలిపారు. రవాణా రంగం వల్లే 40 శాతం కాలుష్యం జరుగుతోందన్నారు. చమురు ఇంధనాలను దిగుమతి చేసుకోవడానికి ఏటా రూ.22 లక్షల కోట్ల ఖర్చు జరుగుతోందని, ఇది ఆర్థిక భారమన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాల వైపు మళ్లాలని సూచించారు.