SDPT: రహదారి భద్రత నియమాలు ప్రజలకు అర్థమయ్యేలా రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..రహదారి భద్రత నియమాలను సరిగా పాటించడం మూలంగా ఎక్కువశాతం రహదారి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.