కేరళలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. తప్పతాగి ఓ ఆటో డ్రైవర్ రైలుపట్టాలపై ఆటోను నిలిపివేశాడు. ఈ క్రమంలో అదే ట్రాక్‌పై వస్తున్న కాసర్గోడ్-తిరువనంతపురం రైలు ప్రమాదానికి గురైంది. అయితే, లోకోపైలట్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.