GDWL: ఆశా కార్యకర్తలతో వెట్టిచాకిరి చేయించుకోవడం మానుకొని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లో మెడికల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆశాల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.