ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు పూల నాగరాజు విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సహా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.