నెల్లూరు జిల్లాలో సచివాలయ భవనాల నిర్మాణం నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వక 37 మండలాల్లో పనులు ఆగిపోయాయి. మంజూరైన 544 భవనాల్లో 175 అసంపూర్తిగా ఉండగా, 49 పనులు అసలు మొదలుకాలేదు. కూటమి ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని ఆశగా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు పూర్తి చేస్తామని SE తెలిపారు.