MBNR: ధరూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. మండలంలోని మన్నాపురం, చిన్నిపాడు, పార్చర్ల గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.