SRPT: గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో మోతే మండలం హుస్నాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన అక్కినపల్లి శ్రీరాము, ఇతర వార్డు సభ్యులను ఆయన శాలువాతో సత్కరించారు.