బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, దర్శకుడు రోహిత్ శెట్టి కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.