అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ములియపుట్టులో బుధవారం జరిగిన పెసా గ్రామ సభ జనం లేక వెలవెలబోయింది. అధికారుల ముందస్తు సమాచారం, దండోరా లేకపోవడంతో గిరిజనులు హాజరు కాలేదు. దీంతో సభ నామమాత్రంగా సాగింది. ఇకనైనా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి, పెసా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అప్పుడే సభలు సఫలమవుతాయని హాజరైన వారు కోరుతున్నారు.