SKLM: క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగం, క్షమ వంటి విలువలు సమాజానికి శాశ్వత మార్గ దర్శకాలని పేర్కొన్నారు.