BPT: సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామంలో ఇవాళ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఉషా శైలజతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.