కొన్ని చిట్కాలతో చేతులు పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పొడి, అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి చేతులపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. కట్ చేసిన టమాటా ముక్కను ఓట్ మీల్ పొడిలో అద్ది చేతిపై 15 ని. మర్దన చేస్తే మంచిది. బాగా పండిన అరటి పండ్ల ముక్కలు లేదంటే పండ్ల తొక్కలను చక్కెరలో అద్ది చేతులపై స్క్రబ్ చేయాలి.