టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి గిల్‌ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్య కూడా పరుగులు చేయకపోవడంతోనే గిల్‌పై వేటు పడినట్లు తెలిపాడు. ఫామ్‌లో లేని ఒక్క ఆటగాడికి మాత్రమే జట్టులో అవకాశం ఇవ్వొచ్చని.. అంతకు మించి సాధ్యం కాదన్నాడు. గిల్ కూడా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెప్పాడు.