బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. బంగ్లా ప్రధాన సలహాదారుకు అమెరికా చట్టసభ్యులు మరోసారి లేఖ రాశారు. బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాలని కోరారు. కాగా, ఇటీవల మయమన్సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడు మూక దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.