ADB: ఫోన్ వాడినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతారనే భయంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగింది. జైనథ్ KGBVలో చదువుతున్న కెరమెరికి చెందిన బాలిక ఫోన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు దొరికిపోయింది. భయాందోళనకు గురైన ఆమె మంగళవారం పాఠశాల నుంచి పారిపోయింది. పెనంగా కెనాల్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.