AP: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు రానున్నాయి. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 క్యాంటీన్లు ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.