సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నిర్వహించే శ్రీ సత్యసాయి గిరి ప్రదక్షిణ 2026 సంవత్సరపు షెడ్యూల్ను భక్తుల కోసం విడుదల చేశారు. ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 6:30 గంటలకు గణేశ్ గేట్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 2 నుంచి డిసెంబర్ 23 వరకు పౌర్ణమి తిథుల్లో ఈ ప్రదక్షిణ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.