MLG: జనవరి 5 లోపు మేడారంలోని పనులు పూర్తవుతాయని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో ఆమె మాట్లాడుతూ.. రాతి శిలాలపై ఆదివాసి ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు, గోత్రాలు చెక్కడంలో ఆలస్యమైందన్నారు. మరో 10 రోజుల్లో ఒక ఆకృతి వస్తుందన్నారు. రాబోయే తరాలకు, పూజారుల ఆచార వ్యవహారాలు తెలిసేలా CM రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.